కండక్టర్ పై చర్య

నా భార్య ను ఈరోజు సాయంత్రం 4:30 కు పెబ్బేరు లో ఎల్లమ్మబండ బస్ ఎక్కించాను. నా పేరు నరేష్ కుమార్. పెద్ద దగడ గ్రామం. నేను స్వయంగా బస్ ఎక్కి సీటు పెట్టాను. అయితే ఆ సీటు లో ఒక చేతి రుమాలు ఉంది. ఆడ వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల ఆ చేతి రుమాలు తీసి వేరే సీటు లో వేశాను. ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చున్నారు. ఆ తర్వాత ఆ సీటు లో కూర్చున్న అతను వచ్చి నేను కొల్లాపూర్ నుండి వస్తున్నాను. లేవండి అన్నాడు. నేను అయ్యా నీవు ఒక్కణివే ఉన్నావు కదా అక్కడ సీటు ఉంది కూర్చో. ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చున్నారు కదా. అంటే అతను ఒప్పుకోలేదు. అయితే కండక్టర్ అతనికే సపోర్ట్ చేసి నా భార్య ను అక్కడి నుండి లేపారు. బస్ లో ఇలాగే ఇంకో సీటు దగ్గర కొట్లాట అయ్యింది. అయితే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని, jedcherla లో rtc సిబ్బంది వచ్చి నా భార్యను మాట్లాడినాడంట. కంప్లైంట్ ఇచ్చింది మేము కాదు. మేము కంప్లైంట్ ఇవ్వక పోయిన మా భార్య పై దురుసుగా కండక్టర్ వచ్చి మాట్లాడినాడు. కావున సదరు కండక్టర్ పై చర్య తీసుకోవాలని కోరుతున్నాను.
Naresh kumar

ప్రియమైన @Vutpala_Naresh_Kumar

పెబ్బైర్–ఎల్లమ్మబండ బస్సులో RTC కండక్టర్ దురుసుగా ప్రవర్తించడం మరియు సీటింగ్ సమస్య విషయంలో తప్పుగా వ్యవహరించడం గురించి మీ ఫిర్యాదును దాఖలు చేయడానికి, మీరు TSRTC కస్టమర్ సపోర్ట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదును దాఖలు చేయాలి. మీరు +914069440000 / 04023450033 కు కాల్ చేయవచ్చు లేదా TSRTC గ్రీవెన్స్ పోర్టల్‌లో మీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. టికెట్ నంబర్, ప్రయాణ తేదీ మరియు బస్సు మార్గం వంటి వివరాలను అందించండి. పరిష్కారం కాకపోతే, ఈ విషయాన్ని TSRTC, మహబూబ్‌నగర్ డివిజన్‌లోని ప్రాంతీయ మేనేజర్‌కు తెలియజేయండి.

ఇప్పటికీ సహాయం అవసరమైతే, మాకు ప్రత్యుత్తరం ఇవ్వండి.